మోదీకి పుతిన్ ప్రత్యేక శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. భారత్-రష్యా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో మోదీ చేసిన కృషిని తన సందేశంలో ప్రస్తావించారు. అంతర్జాతీయ వేదికపై మోదీకి ఉన్న ప్రాధాన్యాన్ని కూడా పుతిన్ పేర్కొన్నారు.ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీతో జరిగిన భేటీని పుతిన్ గుర్తుచేసుకున్నారు. తనకు, రష్యా ప్రతినిధి బృందానికి అందించిన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఇరువురు నేతల మధ్య చర్చలు స్పష్టంగా, నిర్మాణాత్మకంగా సాగాయని పేర్కొన్నారు.మోదీ రాజకీయ పరిజ్ఞానం, ముందుచూపు తమ చర్చల్లో మరోసారి వెల్లడయ్యాయని పుతిన్ తన సందేశంలో పేర్కొన్నారు. భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక,...