ఓపెన్ డిగ్రీతోనూ అడ్వొకేట్‌గా ఎన్‌రోల్‌కు ఓకే

న్యూఢిల్లీ: ఓపెన్‌, డిస్టెన్స్ విధానంలో బ్యాచిలర్ డిగ్రీ చేసినా అడ్వొకేట్‌గా ఎన్‌రోల్ చేసుకునేందుకు సుప్రీంకోర్టు తాత్కాలికంగా అనుమతించింది. అయితే ఎల్‌ఎల్‌బీ మాత్రం రెగ్యులర్‌గా చదివి ఉండాలని స్పష్టం చేసింది.తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్‌ అర్హత ఉన్న అభ్యర్థులకు తాత్కాలిక ఎన్‌రోల్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించింది. తుది తీర్పు వచ్చే వరకు ఈ అనుమతి వర్తిస్తుందని, శాశ్వత ఎన్‌రోల్‌మెంట్ మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపింది.