రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి శ్రీకారం

నూతన క్యూ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చింతకాని మండల పరిధిలోని వందనం గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నూతన క్యూ లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలయ నిధులతో రూ.1,35,000 వ్యయంతో చేపడుతున్న ఈ నిర్మాణ పనులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కన్నెబోయిన గోపి యాదవ్ శంకుస్థాపన చేశారు.వందనం గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావుతో కలిసి గోపి యాదవ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు క్రమపద్ధతిలో వెళ్లేందుకు వీలుగా ఆలయం చుట్టూ స్టీల్ రాడ్లతో క్యూ లైన్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులకు దర్శన సమయంలో సౌకర్యం కలగనుంది.ఈ సందర్భంగా...