కేటీఆర్‌ కొత్త ఛాలెంజ్.. రూ.1,000 కోట్లు ఇవ్వండి!

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు కొల్లగొట్టిందన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలపై స్పందిస్తూ.. తమ కుటుంబ ఆస్తులన్నీ తీసుకుని రూ.1,000 కోట్లు ఇవ్వాలని సవాల్ చేశారు. మిగిలిన రూ.99 వేల కోట్లతో ప్రజలకు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి, పెట్టుబడుల కోసం తాము ఎంతో కృషి చేశామని తెలిపారు. కేసులు, వేధింపులకు భయపడేది లేదని.. న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.