వృద్ధాప్యాన్ని ఆపడం కష్టమే.. ఉన్న జీవితాన్ని ఆస్వాదించండి

వృద్ధాప్యాన్ని ఆపేందుకు, జీవితాన్ని అంతులేకుండా పొడిగించేందుకు ప్రయత్నిస్తున్న టెక్‌ బిలియనీర్లు తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జిమ్ ఆల్‌-ఖలీలీ అన్నారు.దీర్ఘాయువు కోసం ఖరీదైన చికిత్సలు, ప్రయోగాలు చేయడం కంటే.. మనకు లభించిన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడం ముఖ్యమని ఆయన సూచించారు. బ్రయాన్ జాన్సన్ వంటి టెక్‌ దిగ్గజాలు వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రస్తావించారు.కాలం స్వభావం ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదని ఆల్‌-ఖలీలీ తెలిపారు. ఐన్‌స్టీన్‌ సిద్ధాంతాల ప్రకారం వేగం, గురుత్వాకర్షణ ప్రభావంతో కాలం గడిచే వేగంలో మార్పులు ఉంటాయని వివరించారు.టైమ్‌ ట్రావెల్‌పై మాట్లాడుతూ.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గతంలోకి ప్రయాణించడం గణితపరంగా సాధ్యమేనని, అయితే దాని వల్ల...