విశాఖ బీచ్‌లో మిక్చర్ రుచి చూసిన చంద్రబాబు

విశాఖ ఆర్కే బీచ్‌లో శనివారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్ర తీరంలో మిక్చర్ విక్రయిస్తున్న ఓ మహిళను పలకరించి, ఆమె వద్ద మిక్చర్ రుచి చూశారు.తాను ఒంటరి మహిళనని, మిక్చర్ విక్రయమే జీవనాధారమని ఆమె సీఎంకు చెప్పడంతో.. ఆమెకు పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.అనంతరం సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరిస్తున్న మత్స్యకారులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్కూబా డైవర్లతో సీఎం మాట్లాడారు. వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ చర్యలను పరిశీలించారు. అలాగే మ్యాన్‌హోళ్లు, మురుగు కాల్వల శుభ్రతకు ఉపయోగించే సీవరేజ్ రోబో పనితీరును కూడా పరిశీలించారు.