యెమెన్లో భీకర పోరు.. 44 మంది మృతి
24 గంటల్లోనే భారీ ప్రాణనష్టం యెమెన్లో ప్రభుత్వ దళాలు, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. గత 24 గంటల్లో జరిగిన పోరులో 44 మంది మరణించినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. తాయిజ్, లహజ్ ప్రావిన్సుల్లో ఇరు వర్గాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. వ్యూహాత్మక ప్రాంతాల స్వాధీనం కోసం ఇరు పక్షాలు భారీగా బలగాలను మోహరిస్తున్నాయి.