దళితుల భూముల్లో అంగుళం కూడా తీసుకోం: పొంగులేటి
భూ రికార్డుల పరిశీలన భూములు లాక్కోవడానికి కాదు హైదరాబాద్: దళిత రైతుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎర్రవల్లి ఫామ్హౌస్ వ్యవహారంలో కొందరు దళిత రైతులకు నోటీసులు ఇవ్వడంపై ఆందోళన అవసరం లేదన్నారు. భూ రికార్డుల పరిశీలన, సర్వే ప్రక్రియలను భూసేకరణగా భావించొద్దని సూచించారు. రైతుల హక్కులను గుర్తించి, భూ సమస్యలను పరిష్కరించేందుకే ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. దళితులు, గిరిజనుల భూ హక్కులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని పొంగులేటి హామీ ఇచ్చారు.