ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రూ.140 కోట్లు

హైదరాబాద్‌ శివారులో అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్‌ సిటీకి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. రవాణా వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు లింక్‌ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి రూ.140 కోట్లు కేటాయించింది.బెంగళూరు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జాతీయ రహదారులను అనుసంధానించేలా పలు కీలక రహదారులను అభివృద్ధి చేయనున్నారు. మీర్‌ఖాన్‌పేట్‌, మేడిపల్లి, యాచారం, తిమ్మాపూర్‌, రాచలూరు, కొనల్‌గూడ ప్రాంతాల్లో లింక్‌ రోడ్ల పనులు చేపట్టనున్నారు. ఈ పనులను ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయి.అదే సమయంలో ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌-13 నుంచి ఆకుతోటపల్లి వరకు 41.5 కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల రతన్‌ టాటా...