లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
సరుబుజ్జిలి సెప్టెంబర్ 22. తుపాను ప్రభావంతో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆమదాలవలస సీఐ సన్యాసి నాయుడు,తహసీల్దార్ మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సరు బుజ్జిలి మండలం అగ్రహారం వద్ద వంశదార నది అగ్రహారం గ్రామంలో పరిస్థితిని పరిశీలించారు.ఆయా సచివాలయాల సిబ్బందితో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రస్తుతం నదిలో ప్రవాహం సాధారణంగానే ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తగా ఆయా ప్రాంతాల్లో తాళ్లు,చెట్లను తొలగించే సిబ్బంది, ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.