అంబేద్కర్ నగర్ కాలనీలో డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి
సింగరేణి: సెప్టెంబర్, 22: సింగరేణి గ్రామపంచాయతీ లోని అంబేద్కర్ నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఆదేర్ల వినయ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ నగర్ కాలనీలో తేలికపాటి వర్షం పడినా రహదారులు బురదమయం అవుతున్నాయని దీనికి కారణం డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమేనని ఇండ్లలో వాడుకుంటున్న మురుగునీరు వెళ్లే దారి లేక చిన్నపాటి వర్షానికి వర్షపు నీరు మురుగునీరు కలిసి ఇండ్ల బయటికి వచ్చి బురద మయంగా మారుతున్నాయని ఈ సమస్యను పరిష్కరించాలని కారేపల్లి గ్రామపంచాయతీ...