స్లీపర్ బస్సులో మంటలు.. 9 మంది మృతి

🚌 యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ బస్సులో మంటలు 🔥 ప్రమాదంలో 9 మంది మృతి.. పలువురికి గాయాలు ఉత్తరప్రదేశ్‌లో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై తెల్లవారుజామున స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.ఢిల్లీ నుంచి మహోబాకు వెళ్తున్న బస్సులో ప్రమాద సమయంలో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో కొందరు ప్రయాణికులు కిటికీల నుంచి బయటకు దూకి తప్పించుకున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.బస్సులో ప్రయాణికులు నిద్రలో ఉండటంతో మంటలను గుర్తించడంలో ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.