వర్షాలకు కొట్టుకుపోయిన ప్రధాన రహదారి......
పట్టించుకోని అధికారులు.. BMS జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్ చీదేళ్ల–చెట్ల ముకుందాపురం రహదారి ఛిద్రం.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు... అంబులెన్స్ కూడా వెళ్లలేని దుస్థితి.. .. రహదారి మరమ్మతులకు డిమాండ్... సూర్యాపేట, సెప్టెంబర్ 24:పెన్ పహాడ్ మండలం చీదేళ్ల గ్రామం నుంచి చెట్ల ముకుందాపురం వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిని కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించడం ప్రజలకు ప్రాణసంకటంగా మారిందని సామాజిక కార్యకర్త, భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా రహదారి పలుచోట్ల కోతకు గురై పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయని, ప్రస్తుతం రోడ్డు మొత్తం...