హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం

హైదరాబాద్ గచ్చిబౌలిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఆయన జయంతి సందర్భంగా సెప్టెంబర్ 26న సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.దేశ ఆర్థిక వ్యవస్థలో మన్మోహన్ సింగ్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టారని మంత్రి గుర్తు చేశారు.ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు వంటి చట్టాలు ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో అమల్లోకి వచ్చాయని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలోనూ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.