మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం కార్యక్రమము....
వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల శాతం పెంచడమే మా లక్ష్యం... మండల తాసిల్దార్ కమలాకర్ అనంతగిరి, సెప్టెంబర్ 25 : అనంతగిరి మండల కేంద్రంలో గురుపూజోత్సవం సందర్భంగా అనంతగిరి మండలానికి సంబంధించి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు 13 మందిని మరియు జిల్లా స్థాయి అవార్డు పొందిన ఇద్దరికీ సెప్టెంబర్ 25 వ తేదీన మండల విద్యా వనరుల కేంద్రంలో సన్మానం చేయనైనది. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి తల్లాడ శ్రీనివాసరావు అధ్యక్షత వహించినారు. ముఖ్యఅతిథిగా అనంతగిరి మండల తహసిల్దార్ కమలాకర్ పాల్గొన్నారు. మండల తాసిల్దారు కమలాకర్ మాట్లాడుతూ మన మండలం నుండి జిల్లా స్థాయికి ఇద్దరు ఎంపిక కావడం మరియు 13 మంది...