అమెరికా వీసాకు భారీ వెయిటింగ్.. హైదరాబాద్లో 12 నెలలు
అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు విజిటర్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ ఆలస్యమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు ఏడాది వరకు వేచి చూడాల్సి వస్తోంది.తాజా వివరాల ప్రకారం హైదరాబాద్లో సగటు వెయిటింగ్ టైమ్ 11.5 నెలలుగా ఉంది. ముంబైలో 11 నెలలు, ఢిల్లీలో 7.5 నెలలు, చెన్నైలో 7 నెలలుగా నమోదైంది. అయితే విద్యార్థి, ఉద్యోగ వీసాల అపాయింట్మెంట్లు మాత్రం తక్కువ సమయంలోనే లభిస్తున్నాయి. హైదరాబాద్లో విద్యార్థి వీసాకు సుమారు 1.5 నెలల సమయం పడుతోంది. అదనపు స్లాట్లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ముందస్తు తేదీ అందుబాటులోకి వస్తే ఇప్పటికే బుక్ చేసుకున్నవారు రీషెడ్యూల్ చేసుకోవచ్చని సూచించారు.