కోపం వస్తే తలలో నరం చిట్లిపోతుందా? అసలు నిజం ఏంటి?
కోపం వచ్చినప్పుడు తలలో నరం చిట్లిపోతుందని పెద్దలు, చుట్టుపక్కల వారు చెప్పడం మనం తరచూ వింటుంటాం. అయితే వైద్యపరంగా చూస్తే కోపం వచ్చిన ప్రతిసారీ తలలోని నరం చిట్లిపోవడం అనేది నిజం కాదు. కానీ తీవ్రమైన కోపం, ఒత్తిడి సమయంలో శరీరంలో జరిగే కొన్ని మార్పులు మాత్రం ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మనకు ఒక్కసారిగా కోపం వచ్చినప్పుడు శరీరం వెంటనే అప్రమత్త స్థితిలోకి వెళ్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగం పెరగడం, రక్తపోటు పెరగడం వంటి మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో అడ్రినలిన్ వంటి హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. శరీరం ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యే ఈ ప్రతిస్పందనను సాధారణంగా ‘ఫైట్ ఆర్...