వెల్లుల్లి కారం పచ్చడి.. వర్షాకాలంలో ఇలా తింటే?

వర్షాకాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ సమయంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈ సమయంలో తీసుకునే ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం కూడా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మన వంటింట్లో సులభంగా లభించే వెల్లుల్లిలో పలు పోషక విలువలు ఉన్నాయి. వెల్లుల్లిని ఎండుమిర్చి, జీలకర్రతో కలిపి తయారు చేసే కారం పచ్చడి రుచితో పాటు ఆహారంలో ఒక మంచి కలయికగా ఉంటుంది. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి లేదా నూనెతో ఈ పచ్చడిని కలిపి తింటే రుచికరంగా ఉంటుంది....