హైదరాబాద్ బిర్యానీకి అరేబియన్ టచ్.. నగరంలో మండి బిర్యానీకి పెరుగుతున్న క్రేజ్
హైదరాబాద్ అంటే వెంటనే గుర్తొచ్చే వంటకం దమ్ బిర్యానీ. కానీ నగరంలోని ఫుడ్ లవర్స్ ఇప్పుడు కొత్త రుచులను కూడా ఆస్వాదిస్తున్నారు. హైదరాబాదీ దమ్ బిర్యానీతో పాటు అరేబియన్ రుచులతో తయారయ్యే మండి బిర్యానీకి కూడా నగరంలో డిమాండ్ పెరుగుతోంది. సువాసనలతో కూడిన బాస్మతి అన్నం, మెత్తగా ఉడికించిన మాంసం, ప్రత్యేకమైన అరేబియన్ మసాలాల కలయిక మండి బిర్యానీకి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. బర్కాస్ నుంచి నగరంలోని కొత్త ప్రాంతాల వరకు.. హైదరాబాద్లో మండి బిర్యానీ కొత్త వంటకం కాదు. ముఖ్యంగా పాతబస్తీలోని బర్కాస్ ప్రాంతంతో దీనికి ప్రత్యేక అనుబంధం ఉంది. నిజాం కాలంలో యెమెన్ నుంచి వచ్చిన సైనికులు హైదరాబాద్లో నివసించడంతో వారి ఆహారపు...