హైదరాబాద్‌లో రాక్ క్లైంబింగ్‌కు పెరుగుతున్న క్రేజ్
జిమ్‌లో వర్కౌట్స్‌తో పాటు ఇప్పుడు హైదరాబాద్ యువత కొత్త ఫిట్నెస్ ట్రెండ్ వైపు అడుగులు వేస్తోంది. గోడలు, కొండలు ఎక్కుతూ అడ్వెంచర్‌ను ఆస్వాదించే రాక్ క్లైంబింగ్పై నగరంలో ఆసక్తి పెరుగుతోంది. ఫిట్నెస్తో పాటు ఏకాగ్రత, ధైర్యం, బ్యాలెన్స్ పెంచుకునేందుకు యువత ఈ క్రీడను ఎంచుకుంటోంది. రాక్ క్లైంబింగ్లో చేతులు, భుజాలు, వీపు, కాళ్లు, కోర్ కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది. అదే సమయంలో ప్రతి అడుగును ఆలోచిస్తూ ముందుకు సాగాల్సి ఉండటంతో ఏకాగ్రత, సమస్య పరిష్కార నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయని క్లైంబింగ్ శిక్షకులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ఖాజాగూడ, మౌలాలి, దుర్గం చెరువు, మహేంద్రహిల్స్, ఘర్-ఎ-ముబారక్, సూరారం వంటి ప్రాంతాల్లో క్లైంబింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. తెలంగాణలో వరంగల్,...