పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పిర్యాదు దారులతో మాట్లాడిన ఎస్పి నరసింహ ఐపిఎస్
ప్రజా ఫిర్యాదులపై వేగంగా పోలీస్ సేవలు : జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సూర్యాపేట జిల్లా,సెప్టెంబర్ 28 :సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీసు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వినతులను పరిశీలించారు. ప్రజలు అందించే ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సేవలు, తక్షణ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ప్రజా రక్షణ కోసం పోలీసు సిబ్బంది అనుక్షణం...