నిమిషాల్లోనే జీవితం ముగించే వింత జీవులు
ప్రకృతిలో కొన్ని జీవుల జీవన ప్రయాణం మన ఊహకు అందనంత వేగంగా సాగుతుంది. పుట్టడం, పెరగడం, సంతానోత్పత్తి చేయడం, చనిపోవడం.. మొత్తం జీవచక్రం కొన్ని నిమిషాలు లేదా కొన్ని నెలల్లోనే పూర్తవుతుంది. 5 నిమిషాల జీవితం మేఫ్లైలోని కొన్ని జాతుల ప్రౌఢ దశ కేవలం కొన్ని నిమిషాలే ఉంటుంది. నీటిలో ఎక్కువకాలం గడిపిన తర్వాత బయటకు వచ్చి, జతకట్టి గుడ్లు పెట్టడం పూర్తయిన వెంటనే వాటి జీవితం ముగుస్తుంది. 59 రోజులకే ముగింపు పిగ్మీ గోబీ అనే చిన్న సముద్రపు చేప వెన్నెముక ఉన్న జీవుల్లో అతి తక్కువ ఆయుష్షు కలిగిన వాటిలో ఒకటి. దీని జీవితం సుమారు రెండు నెలల్లోపే పూర్తవుతుంది. వర్షాకాలంతో మొదలై.....