దసరా సంప్రదాయం పేరుతో పాలపిట్టలను బంధించొద్దు.. అటవీశాఖ హెచ్చరిక
విజయదశమి సందర్భంగా పాలపిట్టలను పట్టుకుని పంజరాల్లో ఉంచడం లేదా ప్రజలకు ప్రదర్శించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ అటవీశాఖ హెచ్చరించింది. పాలపిట్టలను స్వేచ్ఛగా వాటి సహజ ఆవాసంలో చూడటమే సంప్రదాయమని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు క్షేత్రస్థాయి సిబ్బందికి అటవీశాఖ ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు.హైదరాబాద్లోని అరణ్యభవన్లో అటవీశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దసరా సందర్భంగా పాలపిట్టల సంరక్షణతో పాటు పక్షులకు ప్రమాదకరంగా మారుతున్న చైనా మాంజా అంశంపై సమావేశంలో చర్చించారు. అటవీ దళాల అధిపతి వినయ్ కుమార్ అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. పాలపిట్టలను పంజరాల్లో పెట్టొద్దు విజయదశమి రోజున పాలపిట్టను చూడటం...