విండీస్ విధ్వంసం.. టీమిండియా ముందు 406 పరుగుల భారీ లక్ష్యం
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆ జట్టు బ్యాటర్లు భారత బౌలింగ్‌ను చితక్కొట్టారు. జాన్ క్యాంప్‌బెల్, షై హోప్, అమీర్ జంగూ శతకాలతో చెలరేగడంతో వెస్టిండీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే టీమిండియా 406 పరుగులు చేయాల్సి ఉంది. ముగ్గురు బ్యాటర్ల సెంచరీలతో పరుగుల వరద టాస్ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు జాన్ క్యాంప్‌బెల్ దూకుడైన ఆరంభాన్ని అందించాడు. భారత బౌలర్లపై మొదటి నుంచే ఒత్తిడి పెంచిన అతడు బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన క్యాంప్‌బెల్.. మొత్తంగా 68 బంతుల్లో 101 పరుగులు...