పేరు మారితే సిద్ధాంతం మారదు.. కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 30: పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చినంత మాత్రాన తమ సిద్ధాంతం, ఆలోచనా విధానం, నాయకత్వం మారదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడిన ఆయన.. పార్టీ పేరు మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తన పేరు షారుఖ్ ఖాన్గా మార్చుకున్నంత మాత్రాన తాను షారుఖ్ ఖాన్ అయిపోనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అదే విధంగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చినప్పటికీ పార్టీ విధానాల్లో మార్పు రాలేదని స్పష్టం చేశారు. తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధిస్తున్నప్పుడు.. తెలుగు గడ్డపై పుట్టిన రాజకీయ పార్టీ జాతీయ స్థాయికి ఎందుకు విస్తరించకూడదని ఆయన ప్రశ్నించారు.తెలంగాణలో అమలు చేసిన...