సిరిసిల్లలో సీఎం రేవంత్ పాదయాత్ర.. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

సిరిసిల్ల, సెప్టెంబర్ 30: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్లకు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్‌లోని నేతన్న విగ్రహం మీదుగా రగుడు బైపాస్ వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతోంది. అనంతరం బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.సీఎం పాదయాత్రకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో సిరిసిల్లలోని ప్రధాన రహదారులు కాంగ్రెస్ శ్రేణులతో సందడిగా...