రాజస్థాన్‌కు విద్యుత్ ఒప్పందం రద్దు చేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్ రావు లేఖ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి రాజస్థాన్‌కు 800 మెగావాట్ల విద్యుత్ కేటాయింపుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ బొగ్గు, నీరు, భూమి వనరులతో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఇతర రాష్ట్రానికి ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించిన హరీశ్ రావు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.