అక్టోబర్ 2న UPI సేవలు.. ‘నో UPI డే’ రద్దు
యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదించిన ఫీజుకు వ్యతిరేకంగా అక్టోబర్ 2న చేపట్టాలనుకున్న ‘నో UPI డే’ నిరసనను వ్యాపార సంఘాలు విరమించుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో వ్యాపార ప్రతినిధులు సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.2,000కు మించిన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఫీజు ప్రతిపాదనపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫీజుతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలపై భారం పెరుగుతుందని తెలిపారు. వ్యాపారులు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను ఉపసంహరించుకున్నట్లు ప్రతినిధులు వెల్లడించారు. కాగా, ప్రతిపాదిత ఫీజు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. రూ.2,000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలకు జీరో...