బుర్రిపాలెంలో 3డీ ఇళ్లు.. 45 రోజుల్లోనే నిర్మాణం!
ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణ రంగంలో కొత్త సాంకేతికతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో 100 ఇళ్లను పైలట్ ప్రాజెక్టుగా నిర్మించనున్నారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) కింద చేపడుతున్న ఈ ప్రాజెక్టును అక్టోబర్ 4న సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు.కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, రూర్కీలోని సీబీఆర్ఐ సాంకేతిక సహకారంతో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. ప్రత్యేక 3డీ ప్రింటర్లతో కాంక్రీట్ మిశ్రమాన్ని పొరలుగా ముద్రిస్తూ ఇళ్ల గోడలను నిర్మిస్తారు.ప్రతి ఇంటిని సుమారు 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. సంప్రదాయ నిర్మాణ పద్ధతులతో పోలిస్తే 3డీ ప్రింటింగ్ విధానంలో ఇళ్లను...