వాలీబాల్‌లో భారత్‌కు షాక్.. పాకిస్థాన్ చేతిలో క్వార్టర్స్‌లో పరాజయం
ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల వాలీబాల్ జట్టుకు నిరాశ ఎదురైంది. క్వార్టర్ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో భారత్ 0-3తో ఓటమిపాలై పతక పోటీ నుంచి నిష్క్రమించింది.జపాన్‌లోని ఒకాజాకి చువో సోగో పార్క్ జిమ్నాసియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు పాకిస్థాన్ గట్టి పోటీ ఇచ్చింది. అయితే కీలక సమయాల్లో పాక్ ఆటగాళ్లు పైచేయి సాధించారు. 25-19, 25-23, 25-18 స్కోర్లతో వరుసగా మూడు సెట్లను గెలుచుకున్న పాకిస్థాన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అంతకుముందు గ్రూప్ దశలో భారత్ అజేయంగా నిలిచింది. మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన టీమిండియా.. ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు కోల్పోయినా 3-2తో అద్భుతంగా పుంజుకుంది.క్వార్టర్ఫైనల్లో...