భవిష్యత్తు యుద్ధాలకు అమెరికా భారీ ప్లాన్.. మస్క్కు కీలక బాధ్యతలు
భవిష్యత్తులో యుద్ధాల స్వరూపం ఎలా మారనుంది? వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి సాంకేతికత అవసరం? ఈ అంశాలపై అమెరికా రక్షణ శాఖ భారీ కసరత్తు ప్రారంభించింది.‘ప్రాజెక్ట్ మెరిడియన్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎలాన్ మస్క్, ఆండ్యూరిల్ వ్యవస్థాపకుడు పామర్ లక్కీ, అమెరికా మాజీ ప్రతినిధుల సభ స్పీకర్ న్యూట్ గింగ్రిచ్ నేతృత్వం వహించనున్నారు. 120 రోజుల్లోగా భవిష్యత్తు యుద్ధాలకు అవసరమైన సాంకేతికత, ఆయుధ వ్యవస్థలు, సైనిక సామర్థ్యాలపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.భూగర్భ ప్రాంతాల నుంచి భూమి, చంద్రుడి మధ్య అంతరిక్షం వరకు ఎదురయ్యే సవాళ్లను ఈ ప్రాజెక్టు అధ్యయనం చేయనుంది. ముఖ్యంగా స్వయంప్రతిపత్తితో పనిచేసే యుద్ధ వ్యవస్థలు, అధునాతన రక్షణ సాంకేతికతపై దృష్టి పెట్టనున్నారు.ఇదే సమయంలో...