అమరావతి రైతుల గోడు ఎప్పటికి తీరేను?
అమరావతి: రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులు తమకు సంబంధించిన పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములిచ్చి ఏళ్లు గడుస్తున్నా ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లు, భూముల సరిహద్దుల గుర్తింపు, అసైన్డ్ భూముల అంశాలు తదితర సమస్యలపై స్పష్టత రావాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. సమస్యలపై రైతుల అసంతృప్తి ల్యాండ్ పూలింగ్ పరిధిలోని కొన్ని గ్రామాల్లో భూముల వ్యవహారాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కోర్టు కేసులు, రహదారి నిర్మాణాలు, భూసేకరణకు సంబంధించిన అంశాల్లో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా అసైన్డ్ భూముల రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్...