నీరు వృథా చేస్తే నల్లా కట్!

: హైదరాబాద్ నగరంలోదాదాపు రెండు కోట్ల మంది జనాభా ఉన్నారు. అయితే ఎల్ నినో ప్రభావంతో ఈసారి తాగునీటి ఎద్దడి నెలకొంది. అయినప్పటికీ ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని కేవలం తాగునీటినే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జల మండలి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ వాసులకు తాగు నీటి కోసం ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నీటి వృధాను అరికట్టాలని నిర్ణయించారు. అలాగే ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు. గొంతు తడుపుకునేందుకు మాత్రమే తాగు నీటిని వినియోగించాలని, ఇతర అవసరాలకు ఏ మాత్రం తాగునీటిని వినియోగించినా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో...