బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: చంద్రబాబు
రేపల్లె: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. బీసీ రిజర్వేషన్లను గత ప్రభుత్వం 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందని ఆరోపించారు. తాము మళ్లీ 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రయత్నిస్తే కోర్టును ఆశ్రయించి అడ్డుకున్నారని విమర్శించారు. ఈ అంశంపై రేపే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని చంద్రబాబు ఆరోపించారు. అప్పులు తెచ్చేందుకు రాష్ట్ర ఆస్తులను, భవిష్యత్ ఆదాయాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. తాము అధికారంలోకి...