బీసీ రిజర్వేషన్లపై టీడీపీ, వైసీపీ రాజకీయాలు

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై టీడీపీ, వైసీపీలు రాజకీయాలు చేస్తున్నాయని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. బీసీలను ఓట్ల కోసం మోసం చేస్తున్నాయని ఆరోపించారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.ఈ తీర్పుపై స్పందించిన విజయసాయి రెడ్డి.. చట్టపరంగా నిలబడవని తెలిసినా 50 శాతం పరిమితిని దాటేలా జీవోలు జారీ చేసి, ఆ తర్వాత కోర్టుల్లో కేసులు వేయడం రెండు పార్టీలకు పరిపాటిగా మారిందని ఆరోపించారు....