ఎల్‌నినో ఎఫెక్ట్‌.. అక్టోబర్‌లో ఎండల మోత!

ఈసారి చలికాలం కాస్త వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా అక్టోబర్‌లోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో తెలంగాణలో రానున్న రోజుల్లో వేడి వాతావరణం కొనసాగవచ్చని తెలుస్తోంది.వర్షాకాలం ముగిసిన నేపథ్యంలో అక్టోబర్‌ నుంచి చలికాలం దశ ప్రారంభమైనప్పటికీ.. ఈసారి చలి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా సాధారణ స్థాయికి తగ్గే అవకాశాలున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో తగ్గిన వర్షాలు తెలంగాణలో ఈ ఏడాది వర్షపాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు....