ఓటర్లకు గుడ్‌న్యూస్.. ఆఫీసులకు రావొద్దు!

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్ తెలిపారు. పత్రాలు సమర్పించేందుకు ఈఆర్‌వో, ఏఈఆర్‌వో కార్యాలయాలకు స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నోటీసులు అందుకున్న వారి ఇళ్లకే బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) వెళ్లి అవసరమైన పత్రాలను తీసుకుంటారని తెలిపారు. అనంతరం ఆ పత్రాలను అధికారులే ఎన్నికల కమిషన్‌ ఆన్‌లైన్‌ వ్యవస్థలో నమోదు చేస్తారని వివరించారు. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు నగరాల్లోని నైట్‌ షెల్టర్లు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల ఓటు నమోదు కోసం అవసరాన్ని బట్టి ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు,...