2027 వరల్డ్ కప్ షెడ్యూల్.. భారత్-పాక్ ఫైట్ ఎప్పుడంటే?
2027 వన్డే ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. ఐసీసీ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించడంతో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిమానుల ఎదురుచూపులు మొదలయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21, 2027 వరకు జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లో పాకిస్థాన్‌తో తలపడుతుంది. భారత్-పాక్ మ్యాచ్ కోసం వాండరర్స్ స్టేడియం వేదిక కానుంది. కొత్త ఫార్మాట్లో టోర్నీ ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు, 57 మ్యాచ్‌లు ఉంటాయి. ముందుగా మూడు జట్లతో సూపర్ సిరీస్ నిర్వహిస్తారు. ఆ తర్వాత 12 జట్లు...