ట్రంప్‌ AI టేబుల్‌లో భారతీయుల హవా.. మరి భారత్‌ ఎక్కడ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షతన సెప్టెంబర్‌ 29న వైట్‌హౌస్‌లో జరిగిన ఏఐ సమావేశంలో ప్రపంచ టెక్‌ దిగ్గజాల అధిపతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారతీయ మూలాలున్న పలువురు టెక్‌ ప్రముఖులు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తారు. సమావేశంలో భారతీయుల ప్రాతినిధ్యం గణనీయంగా కనిపించినప్పటికీ.. ప్రపంచ ఏఐ రంగంలో భారత్‌ స్వయంగా ఎంతటి స్థానం సంపాదించుకుంది అన్నది ఇప్పుడు చర్చకు వచ్చింది. ప్రతిభ విషయంలో భారత్‌కు కొరత లేకపోయినా, పరిశోధనకు అవసరమైన మౌలిక వసతులు, భారీ పెట్టుబడులు, స్టార్టప్‌లకు అందే మూలధనం, పెద్ద మార్కెట్ల విషయంలో ఇంకా అంతరం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఏఐపై అమెరికా ఫోకస్‌...