కొరియా ఆధిపత్యానికి చెక్.. భారత్కు చారిత్రక స్వర్ణం!
ఏషియన్ గేమ్స్ ఆర్చరీలో భారత మహిళల రికర్వ్ జట్టు చరిత్ర సృష్టించింది. అంకిత భకత్, కీర్తి శర్మ, కుంకుమ్ మొహోడ్లతో కూడిన భారత త్రయం ఫైనల్లో దక్షిణ కొరియాను 5-3తో ఓడించి స్వర్ణ పతకం సాధించింది. మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్లో భారత్కు ఇదే తొలి స్వర్ణం. 44 ఏళ్లుగా ఈ విభాగంలో కొనసాగుతున్న కొరియా ఆధిపత్యానికి భారత జట్టు తెరదించింది. ప్రపంచ ఛాంపియన్గా ఉన్న కొరియాపై ఒత్తిడిని తట్టుకుని భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శన చేశారు. అంతకుముందు సెమీఫైనల్లో భారత్ చైనాను 5-1తో ఓడించి ఫైనల్కు చేరింది. సెమీస్లో కీలక సమయాల్లో కీర్తి శర్మ వరుసగా 10 పాయింట్ల షాట్లు సాధించి జట్టు విజయానికి...