జపాన్‌పై భారత్‌ విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన జోడీ!

ఏషియన్ గేమ్స్‌ 2026లో భారత్‌కు మరో పతకం ఖాయం అయింది. మిక్స్‌డ్ రికర్వ్ టీమ్‌ సెమీఫైనల్లో కుమ్‌కుమ్, ధీరజ్ బొమ్మదేవర జోడీ జపాన్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.సెమీఫైనల్లో భారత జోడీ స్థిరమైన ప్రదర్శనతో జపాన్‌ను అధిగమించింది. దీంతో స్వర్ణ పతకం కోసం చైనాతో తలపడనుంది. ఈ పోరులో గెలిస్తే భారత్‌ ఖాతాలో మరో గోల్డ్ మెడల్ చేరనుంది.ఇదిలా ఉండగా, మిక్స్‌డ్ రికర్వ్‌లో దక్షిణ కొరియా కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఆ జట్టు 5-1తో ఆతిథ్య జపాన్‌ను ఓడించింది.