బీసీ రిజర్వేషన్లపై అసలు కథ ఇదే.. టీడీపీ, వైసీపీ వాదనల్లో ఏంటి తేడా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఆగస్టులో జీవోలు జారీ చేసింది. అయితే ఈ రిజర్వేషన్లకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియ, సుప్రీంకోర్టు నిర్దేశించిన పరిమితులకు సంబంధించిన అంశాలను హైకోర్టు పరిశీలించింది. చివరకు జీవో 105, జీవో 1065లను రద్దు చేసింది. టీడీపీ ఏం చెబుతోంది?...