బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి మళ్లీ వర్షాల సూచన!

అమరావతి: బంగాళాఖాతంలో అక్టోబర్ 13 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది మరింత బలపడి అక్టోబర్ 15 నాటికి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. దీంతో వర్షపాతం లోటుతో ఉన్న ఏపీలో ఈ వాతావరణ వ్యవస్థపై ఆసక్తి నెలకొంది. అధికారుల అంచనా ప్రకారం.. అక్టోబర్ 12న ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడొచ్చు. దాని ప్రభావంతో మరుసటి రోజే అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వ్యవస్థ పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఏపీకి వర్షాలు తక్కువగానే పడ్డాయి....