అనంత్ అంబానీని హత్తుకున్న చంద్రబాబు.. ‘ఏపీ ముద్దుబిడ్డ’ అంటూ ఆప్యాయత
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. అనంత్ అంబానీ ప్రసంగం అనంతరం సీఎం చంద్రబాబు ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని అభినందించారు. “మీరు ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ” అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకుముందు మాట్లాడిన అనంత్ అంబానీ.. ఆంధ్రప్రదేశ్తో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించారు. తనను ఏపీ బిడ్డగా చూడాలని, రాష్ట్ర అభివృద్ధికి తాను ఏం చేయాలో మార్గనిర్దేశం చేయాలని చంద్రబాబును కోరారు. ఆయన ప్రసంగం అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ అభినందించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ అనంత్...