2027 ప్రపంచకప్కు పాండ్యా కీలకం: గంగూలీ
2027 వన్డే ప్రపంచకప్లో భారత జట్టు సమతూకం కోసం హార్దిక్ పాండ్యా కీలకమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. పాండ్యాను పూర్తి ఫిట్నెస్తో ప్రపంచకప్కు సిద్ధం చేయడమే టీమ్ మేనేజ్మెంట్ ముందున్న ప్రధాన సవాల్ అని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా 2027 అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు ప్రపంచకప్ జరగనుంది. గత ప్రపంచకప్లో గాయంతో టోర్నీకి దూరమైన పాండ్యా విషయంలో ఈసారి ప్రత్యేక జాగ్రత్త అవసరమని గంగూలీ అభిప్రాయపడ్డారు. పాండ్యా అందుబాటులో లేకపోతే నితీశ్ కుమార్ రెడ్డి ప్రత్యామ్నాయంగా ఉండొచ్చని ఆయన చెప్పారు. అయితే అప్పటివరకు నితీశ్ వరుసగా క్రికెట్ ఆడుతూ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుందని అన్నారు....