బిగ్ బాస్ 10 బిగ్ ట్విస్ట్:

హౌస్‌లోకి భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు. బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 10లో నాలుగో వారం ముగింపు దశకు చేరుకోవడంతో హౌస్‌లో ఉత్కంఠ పెరిగింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారంతో పాటు, అక్టోబర్ రెండో వారంలో భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండొచ్చనే వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. వైల్డ్ కార్డ్ రేసులో సీరత్ కపూర్, నీతు, మౌనీషా చౌదరి, రామకృష్ణ, సోనియా సింగ్, సౌందర్య రెడ్డి, నూకరాజు, రాకింగ్ రాకేష్ పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరు నిజంగా హౌస్‌లోకి వస్తారనే దానిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఈ వారం నామినేషన్‌లో ముకేశ్ గౌడ, త్రిగుణ్, దేబ్జానీ,...