గయలో విదేశీయుల పిండప్రదానం
పూర్వీకులపై ఉన్న కృతజ్ఞతకు దేశ సరిహద్దులు అడ్డుకావని గయలో జరిగిన ఓ ఆధ్యాత్మిక ఘట్టం చాటిచెప్పింది. జర్మనీ, ఘనా, ఉక్రెయిన్, రష్యా తదితర దేశాల నుంచి వచ్చిన విదేశీయులు బీహార్లోని గయలో ఫల్గుణీ నది తీరానికి చేరుకుని తమ పూర్వీకుల కోసం పిండప్రదానం, తర్పణాలు నిర్వహించారు. స్థానిక పండితుల ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణల మధ్య విదేశీయులు సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. చేతులు జోడించి, కళ్లు మూసుకుని తమ పూర్వీకులను స్మరించుకుంటూ అర్ఘ్యం సమర్పించారు. ఈ సందర్భంగా వారి భావోద్వేగ దృశ్యాలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి. ఉక్రెయిన్కు చెందిన ఒలెక్సాండ్రా మాట్లాడుతూ.. గయకు వచ్చిన తర్వాత తమకు ఎంతో ప్రశాంతత కలిగిందని తెలిపారు. తమను పెంచి పోషించిన...