విజయ్ సర్కార్‌కు మిత్రపక్షాల సెగ

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి అక్టోబర్ 6న జరగనున్న మధురాంతకం, ధరాపురం ఉప ఎన్నికలు కీలకంగా మారాయి. ఈ రెండు స్థానాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీవీకే డబ్బులు పంచుతోందంటూ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. శణ్ముగం ఆరోపించడంతో రాజకీయంగా దుమారం రేగింది. ఈ ఆరోపణలను టీవీకే వర్గాలు ఖండించాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. 234 మంది సభ్యుల సభలో సాధారణ మెజార్టీకి 118 స్థానాలు అవసరం కావడంతో కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్‌, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. మే 13న జరిగిన విశ్వాస పరీక్షలో ప్రభుత్వం 144 ఓట్లతో మెజార్టీ నిరూపించుకుంది. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే నుంచి...