గాంధీ జయంతి నాడు నిబంధనలు తుంగలోకి.. కోదాడలో యథేచ్ఛగా నాన్-వెజ్ విక్రయాలు
లహరి హోటల్ కు రూ.4 వేల జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు కోదాడ, అక్టోబర్ 2 (ఆర్యాద్వి): జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం మాంసాహార విక్రయాలపై నిషేధం విధించినప్పటికీ కోదాడ పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు నిబంధనలను బేఖాతరు చేశాయి. గాంధీ జయంతి రోజున చికెన్, మటన్ వంటకాలను యథేచ్ఛగా విక్రయిస్తూ అధికారులకు పట్టుబడ్డారు. గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా మాంసం దుకాణాలు, చికెన్ సెంటర్లు, హోటళ్లలో నాన్-వెజ్ విక్రయించరాదని మున్సిపల్, పంచాయతీ అధికారులు ముందే ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ పట్టణంలోని కొన్ని హోటళ్లు రహస్యంగా మాంసాహారాన్ని వడ్డిస్తున్నారన్న పక్కా సమాచారంతో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ...