సత్యం.. అహింసే ఆయుధాలు.. గాంధీ చూపిన బాటే దేశానికి వెలుగుబాట

మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతగిరి అక్టోబర్ 02 (ఆర్యాద్వి):అనంతగిరి మండల పరిధిలోని వాయిల సింగవరం గ్రామంలో అనంతగిరి మండలం మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు ,తదితరులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మహాత్ముని సేవలను స్మరించుకున్నారు. మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో సత్యం, అహింస, శాంతి, సహనం, నైతిక విలువలను ఆయుధాలుగా చేసుకుని ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని నాయకులు పేర్కొన్నారు. గాంధీజీ చూపిన అహింసా మార్గం ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచిందన్నారు.గాంధీజీ ఆశయాలు నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, సమాజంలో సత్యనిష్ఠ, మానవత్వం, సమానత్వం, పరస్పర గౌరవం...